Whatsapp : 9963164002

Articles Back Articles

 • మంత్ర శాస్త్రంలో షట్కర్మలు అంటే ఏమిట

  ఇది కేవలం విజ్ఞ్యానం కోసం మాత్రమే మరే విధమయిన ఉద్దేశంతో చెప్పినవి కాదు.

  షట్కర్మలు అంటే ఆరు కర్మలు అని అర్ధం

  అవి ఆకర్షణ,వశీకరణ,విద్వేషణ,ఉచ్చాటన,మారణ,స్తంబన,వీటిని షట్కర్మలు అంటారు వీటిని మనం అంత సులభంగా చెయ్యలేము చాలా మంది వశీకరణ మంత్రాలు యంత్రాలు అని చెబుతారు కాని వీటిని చెయ్యాలి అంటే దానికి తగ్గ మంత్రం ఉపదేశం ఉండాలి మరియు అదిచేసేవిధానం తెలిసి ఉండాలి ఒక వేళ కొన్ని తెలిసినప్పటికీ మనము ఎంచుక్కున్న వ్యక్తి యొక్క శక్తి యుక్తులు తెలిసి ఉండాలి

  దీనికి ముందుగా కొద్దిగా అన్నా జాతక పరిజ్ఞ్యానం ఉండటం మంచిది ఎందుకు అంటే మనం ఎంచుకున్న వ్యక్తి శక్తి గురించి తెలియాలి అన్నాను కదా దానికి అర్ధం అతను శారీరికంగా బలంగా ఉండటం కాదు దైవికంగా ఎంత బలంగా ఉన్నాడు అన్నది తెలుసుకోవాలి ఎందుకు అంటే మనం ప్రయోగం చేసినప్పుడు అది అవతల వ్యక్తి మీదకు వెళ్లినపుడు అతను మనము చేసే సాధన కన్నా బలమయినదో లేదా మనము చేసే దానికి సమానమయినదో చేస్తున్నారు అనుకోండి అది సరిగ్గా పనికిరాదు పనికి రాక పోయినా పర్వాలేదు ఒక్కోసారి మనకే ఇబ్బంది అవుతుంది కనుక ఏమయినా ప్రయోగాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి

  ఇక్కడ ఈ షట్కర్మలు మంచికీ వాడచ్చు చెడ్డకీ వాడచ్చు

  అసలు విషయానికి వస్తే

  మొదటిది ఆకర్షణ : ఆకర్షణవిద్య కొద్దిగా సాత్విక మయినదే ఆకర్షణ అంటే మనమీద నలుగురి దృష్టి పడటం మనం ఒక వందమందిలో ఉన్నప్పుడు అందరిదృష్టి మనమీద పడాలి అనుకోవడం సహజం దీనికొరకు మనం పెద్ద కష్టపడాల్సిన పనిలేదు నలుగురూ మనల్ని చూడాలి గౌరవించాలి అనుకోవడంమంచిదే దీనివల్ల మనల్నిచూస్తారు మనగురించి మాట్లాడుకుంటారు కాని మనం చెప్పినది చేయ్యాలి అనిలేదు ఇది ఒక బృధం మీద పనిచేస్తుంది వారి మనస్సు మీద ప్రభావం చూబిస్తుంది వారు మనము వచ్చినప్పుడు అల్లా కొద్దిగా గౌరవం చూబిస్తారు ఇది అలా మనము మన పని తీరు మార్చే వరకూ వారిమీద ప్రభావం చూబిస్తుంది మనము ఈ ప్రయోగం చేసినప్పుడు ఎలా ఉన్నామో అలా ఉన్నంతవరకూ మాత్రమే పనిచేస్తుంది అందరూ వస్తున్నారు కదా అని గర్వంతో కోపంతో ప్రవర్తిచడం మొదలు పెట్టినప్పుడు లేదా మనం ఆదేవతను విస్మరించినప్పుడు ఈ ఆకర్షణ కొద్దిగా తగ్గిపోతుంది అలా నెమ్మదిగా మొత్తం పోతుంది కాబట్టి ఆకర్షణ చేసుకునేందుకు మంచి విధానం ఒక వస్తువుమీద జప ఫలితాని విడిచి దానిని మన దగ్గర ఉంచుకోవడం ఉత్తమం

  ఆకర్షణకు మొదట్లో లక్ష్మీ గణపతి,సుబ్రహ్మణ్యస్వామి మంత్రాలు బాగా పనిచేస్తాయి మనము చేసేది ఏదయినా సంకల్పంలో ఆకర్షణ కోసం అనిచేబితే ఆకర్షణ వస్తుంది అది ఎంతలా పనిచేస్తుంది అన్నది ఆదేవత మంత్రం మీద మీ సాధన మీద ఆధార పడి ఉంటుంది క్రైన్ తీసుకువచ్చి కిందపడిన పుల్లముక్కల్ని ఎరించినట్టు ఉంటుంది కొన్ని మంత్రాలతో ఆకర్షణ చెయ్యడం అనేది.

  వశీకరణ : వశీకరణ ముక్ష్యంగా ఒకరిమీద మాత్రమే పనిచేస్తుంది ఒకసారి ఒకరి కోసం చెయ్యడానికి పనిచేస్తుంది కొంతమంది ఒకేసారి ఒక పదిమంది వరకూ చెయ్యగలరు ఇది అవతలవారి మెదడు మీద ప్రభావంచూబిస్తుంది మనం ఒక వ్యక్తి మీద ఈ ప్రయోగం చేసినప్పుడు అతను పూర్తిగా మన అదుపులోనికి వస్తాడు మనం చెప్పినదే చేస్తాడు హిప్నోటిస్ కొద్దిగా ఇదే తోవలోకి వస్తుంది కాని ఇక్కడ వవ్యక్తి మన దగ్గర ఉండనవసరంలేదు వారు వాడే ఏదోఒక వస్తువు కాని వారి ముఖ చిత్రం కాని ఉంటే చాలు ముందుచేప్పినట్టుగా ఆవ్యక్తి గురించి తెలిస్తే మంచిది ఒకవేళ అతను కూడా మంచి సాధకుడు అయితే వారిమీద ఇది పనికిరాక పోవచ్చు కాబట్టి ముందుగా అతనిగురించి జాతక పరంగా ప్రశ్న వేసుకుని అతనికి ఏమయినా సాధన ఉందో లేదో కనుక్కుని ముందడుగు వెయ్యడం మంచిది లేదా మనకే ముప్పు వశీకరణకి ఎక్కువగా లలితా,బాల,సుబ్రహ్మణ్యం లాంటి సాత్విక దేవతలు లేదా తార,యక్షినీలేదా భేతాళ సాధన బాగా పనిచేస్తుంది ఎంత బాగా పనిచేస్తాయో అంతే ప్రమాధకరం

  చేసే విధానం వ్యక్తి వాడిన వస్తువు లేదా వ్యక్తి చిత్రం ఎదురుగా ఉంచుకుని సాత్విక దేవతలకు పౌర్ణమి సోమవారం నాడు లేదా శుక్రవారంనాడు ఆవ్యక్తి పేరు చెప్పి మనస్సులో తలచుకుని నాకు వశీకరణ కావాలి అని చెయ్యచ్చు ధర్మంగా అంటే భార్యా భర్తలను కలపటానికి ఇంటిలోనుంచి వెళ్ళిపోయినా అబ్బాయి అమ్మాయిలను తిరిగి రప్పించటానికి మొదలగునవి కాని ఇది చెడుబుద్దితో అధర్మంగా చెయ్యదలస్తే పనికిరాదు నలుగురికి మంచిజరుగుతుంది అంతే ఇది వాడచ్చు మన స్వలాభం కోసం అయితే యక్షినీ(రతిప్రియ)/భేతాళ సాధన చెయ్యాలి ఇది రాహుకాలం లేదా అమావాస్య ఆదివారం చెయ్యడం మంచిది.

  విద్వేషణ : ఇద్దరు వ్యక్తుల మద్య గొడవలు రాప్పించడాన్ని లేదా విడకోట్టదానికి ఇది వాడతారు ఇద్దరు స్నేహితులని కాని ప్రేమికులని కాని వ్యాపారంలో పాట్నర్స్ ని కాని విడకోట్టడానికి అధర్మం గాను లేదా వీరి స్నేహం అంత మంచిదికాదు అని చెడు స్నేహితలతో స్నేహాన్నిపాడుచేయ్యడానికి భర్తను వేరేవారి వ్యామోహం నుండి విడకోట్టడానికి లేదా ఎవరయినా తప్పుడువ్యక్తుల నుండి నచ్చినవారిని లేదా తెలిసినవారిని కాపాడుకోవడానికి వారి స్నేహాన్ని విడకోట్టడానికి ధర్మంగా ఈకర్మను వాడవచ్చు ఇది మంచా చెడా అంటే చేసే విషయం మీద ఆధారపడి ఉంది దీనికి చాలా ఎక్కువగా నారదవిద్యని వాడతారు ధర్మంగా అయితే అధర్మంగా ఏది పనిచెయ్యాలి అని లేదు కాబట్టి వారు మంచివారిని విడకోట్టడానికి అందరికి తెలిసిన వాటిలో వారాహి,హాకీని,లేదా యక్షినీ సాధన చెయ్యవచ్చు ఎక్కువగా స్త్రీలమీద ఈ ప్రయోగం చెయ్యడానికి పురుషదేవతా సాధన పురుషులమీద అయితే స్త్రీ దేవతా సాధన చెయ్యాలి,

  ఇది కొద్దిగా ప్రమాధకరమయినదే ఎవరయినా ఒక గురువుగారి సమక్షంలో చెయ్యడం మంచిది ఆయన ఒప్పుకుంటే.

  స్తంభన : స్తంభన కర్మ అనేది చాలా కష్టమయినది ప్రమాధకరమయినది అసలు ఇది ఏమిటి అంటే ఎవరినయినా ఒక పని చెయ్యనివ్వకుండా ఆపడానికి దీనిని వాడతారు అంటే ఏదయినా కోర్టు కేసులు అలాంటివాటిలో మనకు అవతల ఉన్న వ్యక్తులు ఏమి చెయ్యకుండా ఆగిపోవడానికి లేదా ఏదయినా పనిచేస్తున్న వారిని అది చెయ్యకుండా ఆపడానికి ఇది వాడచ్చు కాని ముందుచెప్పినట్టుగా అవతలవాడి శక్తి తెలుసుకోవాలి తెలియకుండా వెళ్ళడం వల్ల మనకే ఇబ్బందిఅవుతుంది దీనిని కూడా మంచిమార్గంలో వాడవచ్చు మన మీద జరుగుతున్న ప్రయోగాలు జరగకుండా ఆపడానికి ఈ కర్మను వాడవచ్చు ప్రయోగం సఫలీకృతం అవకుండా ఆగిపోతుంది

  దీనికి నృసింహం కాని అఘోర పాశుపతంకాని వాడవచ్చు కొద్దిగా ఎక్కువగా లేదా అధర్మంగా అయితే వారాహి,ధూమ్ర వారాహి లాంటివి వాడవచ్చు.  ఉచ్చాటన : ఇది కుడా చాలా కష్టమయినది ఇబ్బంది కరమయినది ఒకవిధంగా స్తంభన లాగానే పనిచేస్తుంది దానికితోడు ఉన్నచోటునుంది వెల్లిపోయేలా చేస్తుంది ఇదిఎవరిమీద నన్నా ప్రయోగం చేసినప్పుడు వారికి కొద్దిగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఉన్న ఊరునుంచి వెల్లిపోయేలా చేస్తుంది ఇది ఎక్కువగా మనమీద జరిగే ప్రయోగాలనుండి కాపాడటానికి పనిచేస్తుంది ఒకవేళ అవతలవ్యక్తి మరలా మరలా చేస్తున్నాడు అంటే ఆప్రయోగం అతనిమీదనే తిరగబడేలా చెయ్యచ్చు,

  దీనికిగాను నృసింహం, వారాహి,ఛిన్నమస్తా,భాగలాముఖి లాంటి సాధనలు బాగా పనిచేస్తాయి.  మారణం : ఇది మిగతా వాటి మీద చాలా కష్టమయినది ప్రమాదకరమయినది ఒక వ్యక్తిని మానసికముగా గాని శారీరికంగా గాని నాశనం చెయ్యడానికి ఇది వాడతారు దీనిని చేతబడులు చిల్లంగి వంటి వాటిలో వాడతారు దీని గురించి ఇక్కడ ప్రస్తావించడం అంత మంచి విషయంకాదు.

  తరువాతి భాగంలో వీటినుండి ఎలా బయటపడాలో చెబుతాను.

  మీ అనుమానాలు సందేహాలు తెలుసుకోవటానికి సంప్రదించవచ్చు

  అనుదీప్ శర్మ whatsapp 9963164002

  2017-05-08 16:14:19