Whatsapp : 9963164002

Articles Back Articles

 • 2017 రాశిఫలాలు రెమిడీలు

  ఓం శ్రీ మాత్రే నమః

  ఓం శ్రీ గురుభ్యో నమః

  ఇక్కడ చెప్పిన ఫలితాలు కే.పి మరియు వైదిక గోచార జ్యోతిష్యం ప్రకారం తెలియపరిచినవి

  ఇవి మిశ్రమ ఫలితాలు

  మేషరాశి

  ముందుగా మేష రాశి వారికి 2017 సంవత్సరం ఎగుడు దిగుడు గా ఉంటుంది మీకు మొదటి నాలుగు నెలలు అనగా ఏప్రియల్ నెలవరకూ కొద్దిగా ఖర్చు అనుకోని విధంగా ఎక్కువగా ఉంటుంది కాని తరువాతనుండి నలుగురిలో మంచి గౌరవాన్ని పొందుతారు,సంపాదన మీద దృష్టి పెట్టగలిగితే బాగా సంపాదించగలుగుతారు,స్నేహితులతో అనుభవాలు మంచిగా ఉండవు, భాగ్య వ్యయాధి పత్యం పొందినటువంటి బృహస్పతి ఆరవఇంట ఉండటం వల్ల ఉత్తరాయణం ప్రారంభం అయ్యేవరకూ శరీరంలో ఓపిక తక్కువగా ఉంటుంది ఏపనిచేసినా ఉత్సాహంగాచెయ్యలేరు కాని అనుకున్న పనికి అనుకున్నదానికన్నా కొద్దిగా కష్టపడితే మంచి ఫలితాలు పొందగలుగుతారు,భాగ్యస్థానంలో శని సంచారం వల్ల దేవతా కార్యక్రమాలకు ఉత్సాహంగా పాల్గొన గలుగుతారు పుణ్యక్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుంది దాన ధర్మాల మీద దృష్టి ఎక్కువ అవుతుంది, వ్యాపారపరం గా అనుకున్న సంపాదన పొందలేరు వ్యాపారాలకి అవసరమగు డబ్భు అప్పులా తేవటానికి ఇది మంచి సమయము,పంచమ రాహువు వల్ల మే నెల దాటిన తరువాత కొద్దిగా బెట్టింగులు షేర్లు లాంటిద్వారా సంపాదన వస్తుంది కొంత కాలం మాత్రమే,లాభం నందు కేతువు వల్ల అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవుతాయి,విద్యార్దులు చదువు మీద బాగా దృష్టి పెట్టాలి సైన్సు గ్రూప్ వారు మంచి మార్కులు పొందుతారు.

  మీరు దత్తాత్రేయునికి కాని సాయిబాబాకు గాని పసుపు నీళ్ళతో అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది



  వృషభ రాశి

  వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయానికి తగ్గ ఖర్చుతో సాఫీగా సాగుతుంది వీరికి దశమ కేతువు వల్ల గౌరవ భంగం ఏర్పడుతుంది ఏదయినా పని చేసేటప్పుడు గౌరవం కావాలి అనుకుంటే అది వ్యతిరేకంగా మారుతుంది లాభం ఆశించకుండా పనిచెయ్యడం ద్వారా మంచి గౌరవాన్ని పొందుతారు,మంచి వాహనము,స్థలం కొరకు డబ్భు ఖర్చుచేస్తారు,కడుపుకు సంబందించిన సమస్యలు అజీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి ఎక్కువ స్త్రీలకు రక్త హీనత వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్దవారు కొద్దిగా వ్యాయామం చెయ్యడం మంచిది,ఉద్యోగం వ్యాపారం పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు,తల్లి తండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి,షేర్స్ లాంటివి ఆడే వాళ్ళు జాగ్రత్త వహించాలి,ఎవరికన్నా డబ్బులు ఇచ్చేటపుడు జాగ్రత్తగా ఉండాలి,వీరికి వస్తు నష్టం ఉంది,విద్యార్డులకి చదువు బాగుంటుంది కొంతకాలం సరిగ్గా సాగనప్పటికి పరీక్షలలో బాగా ఉత్తీర్ణత సాధిస్తారు,తెలియని భయం ఏర్పడుతుంది.

  మీరు ఆంజనేయస్వామికి పూజ చేయించుకోవడం చాలా మంచిది

  మిధున రాశి

  ఈ రాశి వారికి ఈసంవత్సరం సంపాదనపరంగా చాలా బాగుంటుంది,ఒక విషయం మీద మనస్సుపెట్టలేరు అనుకున్నది అయ్యేలోపు వేరొక పని మొదలుపెట్టేస్తారు దీనివల్ల ఏపనీపుర్తవక నలుగురిలో మాట పడాల్సివస్తుంది ఎక్కువగా సొంతఊరిలో బందువులదగ్గర,ప్రయాణాల పరంగా కొద్దిగా అనారోగ్యాలు ఏర్పడతాయి,మీపేరు మీద ఉన్న స్థలం ఇల్లు అమ్మవలసిరావచ్చు,నూతన వాహనం తీసుకుందాము అనే ఉద్దేశం వస్తుంది దీనికి కొద్దిగా ఇంట్లో వారిద్వారా కొద్దిగా అనుకూలత రాదు,శరీరానికి వొత్తిడి ఎక్కువగా ఇస్తారు,ఉద్యోగపరంగా ఉన్న ఇబ్బందులు అని తొలగిపోతాయి,వ్యాపారములో అవకతోవకలు వస్తాయి కాని పెద్ద ఇబ్బంది ఉండదు,తండ్రి సమానులకి కొద్దిగా అనారోగ్యం చేస్తుంది వారికి దూరంగా ఉండవలసి వస్తుంది,కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి,విద్యార్దులు చాలా జాగ్రత్తగా చదవాలి స్నేహితుల ద్వారా కొద్దిగా ఇబ్బంది పడతారు,ఇతరులని నమ్మి దబ్బుఇవ్వడం మంచిది కాదు,స్పెక్యులేషన్ చేసేవారికి అంత మంచిది కాదు,సోదరులతో కొద్దిగా ఇబ్బందిపడాల్సి వస్తుంది.

  వీరు విష్ణుసహస్రనామ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది.



  కర్కాటక రాశి

  మీరు సంపాదన మీద దృష్టి తగ్గించి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చాలామంచిది,సంపాదన గురించి భయపడాల్సిన పనిలేదు అవసరానికి మించి సంపాదన ఉంటుంది,కొద్దిగా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది గొంతు ఆయాసం ఊపిరికి సంబందించిన సమస్యలు వస్తుంటాయి,గర్వానికి వెళ్లకుండా అనుకువగా ఉండటం మంచిది,చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోగలుగుతారు,ఇంటి కొరకు కొద్దిగా డబ్బు ఖర్చుచేస్తారు,వాహనం మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి,శత్రువులు ఎక్కువగా ఉంటారు వారిగురించి ఆలోచించడం వలన మీకు ఎటువంటి లాభము ఉండదు,ఉద్యోగ పరంగా కొద్దిగా ఇబ్బందులు వస్తాయి,కోర్టు కేసులు లాంటివి అనుకూలంగా ఉండవు,వ్యపారలో పెట్టుబడులు పెట్టడానికి అంత మంచి సమయం కాదు,భయంతో చెయ్యవలసిన పనులు నెమ్మది చేస్తారు,

  మీరు నృసింహ పాశుపత అభిషేకం లేదా హోమం చేయించుకోవడం మంచిది.



  సింహ రాశి

  ఈ రాశివారు కొద్దిగా గర్వాని కోపాన్ని తగ్గించుకోవడం మంచిది,డబ్బుకులోటు ఉండడుకాని సంపాదించడానికి కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది అవమాన పడతారు కూడా,భార్యా భర్తల మద్య మనస్పర్ధలు వస్తాయి అనుకూలంగా ఉండటానికి ప్రయత్నిచండి,పరస్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు,వస్తువులు పడేసుకుంటూ ఉంటారు లేదా దొంగాలించబడతాయి,ఎవరినీ నమ్మకుండా ఉండటం మంచిది, కొత్తగా పెళ్ళిచేసుకున్న భార్యాభర్తల మద్య అనుమానాలు వస్తూ ఉంటాయి,ఉద్యోగ పరంగాకొద్దిగా ఇబ్బంది పడతారు, వ్యాపార పరంగా బాగుంటుంది, రావలసిన డబ్బు కొరకు ప్రయత్నిస్తే తప్పకుండా వచ్చేస్తుంది,,చదువు నెమ్మదిగా ఉంటుంది,ఆరోగ్యం శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు,విదేసీప్రయానానికి ఇదిచాలా మంచి సమయము,స్నేహితులని నమ్మకపోవడం మంచిది,స్పెక్యులేషన్ చెయ్యడం ద్వారా చాలా డబ్బు నష్టపోతారు,మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది,

  మీరు మన్యుసూక్త పారాయణం చేయించుకోవడం మంచిది.

  కన్యా రాశి

  మీకు ఈ సంవత్సరం మిశ్రమఫలితాలుంటాయి విదేశిప్రయాణాలు లేదా పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు,దైవిక కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు,కొద్దిగా అధికబరువు వల్ల ఇబ్బంది పడతారు శరీరం అదుపులో ఉండదు ఆరోగ్య పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి,అనుకున్నట్టు డబ్బుచేతికి వస్తూనే ఉంటుంది,వాహనముల విషయములో జాగ్రత్త అవసరము,ఉద్యోగ పరంగా కొద్దిగా ఆసక్తితక్కువగా ఉంటుంది, వ్యాపారాలు బాగా ఉంటాయి వ్యాపారం ద్వారా సంపాదించిన ధనం ఎదో రకంగా ఖర్చుపెట్టేస్తారు,రహస్య శత్రువర్గం ద్వారా కొద్దిగా ఇబ్బంది పడతారు,విద్యార్దులు కొద్దిగా కష్టపడితే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు,స్పెక్యులేషన్ చేసేవారికి ఎటువంటి లాభము ఉండదు,అప్పులు తీర్చగలుగుతారు,

  మీరు దక్షిణామూర్తికి గాని దత్తాత్రేయునికి గాని విభూదితో అభిషేకం చేసుకోవడం మంచిది.



  తులా రాశి

  వీరు కొద్దిగా నెమ్మదిగా ప్రవర్తించడం మంచిది కొంతకాలం డబ్బులు అవసరానికి మించి ఉంటాయి కొంతకాలం అవసరానికి తగినట్టుగా ఉండవు,కసిగా సంపాదంచడానికి ప్రయత్నిస్తారు దీనిద్వారా కొద్దిగా అనారోగ్యాల పాలవుతారు,వ్యయములో గురువు వల్ల నమ్మకము తగ్గుతుంది చేసేపని నమ్మకంతో చెయ్యడానికి ప్రయత్నించండి, ఉద్యోగపరంగా కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ కొంతకాలానికి ఉద్యోగ అభివృద్ధి పొందుతారు,వ్యాపారపరంగా బాగా సంపాదిస్తారు,విదేసీప్రయానానికి అనుకూలంగా ఉంటుంది,చేయ్యనితప్పులకు శిక్ష అనుభవించాల్సివస్తుంది కోర్తుకేసుల కొరకు డబ్బు ఖర్చుచేయ్యాల్సి వస్తుంది,స్తలం తెసుకోవడానికి మంచి సమయము,విద్యార్దులు బాగా కష్టపడాల్సి వస్తుంది,ప్రయాణాల ద్వారా నీరస పడతారు

  మీరు రుద్రాభిషేకం చెయ్యడం చాలా మంచిది.



  వృశ్చిక రాశి

  మీరు ఇంకొంతకాలం వేచిఉండాలి ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగాఉన్నప్పటికీ మంచి మంచి అవకాసాలువస్తుంటాయి,డబ్బు సంపాదనమీద ఆలోచనలు మొదలుపెడతారు,స్థలాలకోరకు వాహనాల కొరకు డబ్బును వృదాచేస్తారు,తెలియని భయానికి లోనవుతారు,పెద్దవారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి,నలుగురిలో మంచిపేరు ప్రతిష్టలు పొందుతారు మంచి స్థానంలో ఉండగలుగుతారు,విద్యార్దులు ఆరోగ్యంమీద దృష్టిని పెట్టుకోవాలి మానసికవోత్తిడికి లోనవకుండా ప్రాణాయామం చెయ్యడం మంచిది,చిన్నచిన్న ప్రయానాలలో ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు,నలుగురితో కలిసివుండటానికి ప్రయత్నిచండి,తల్లి తండ్రుల గురించి కొద్దిగా ఇబ్బందికరమయిన విషయాలు వినవలసి వస్తుంది,ఎవరినీనమ్మి డబ్బులు ఇవ్వకండి,మీరు నమ్మకంగా ఏదయినాచెయ్యగలిగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు,

  మన్యుసూక్త పారాయణ కాని సుందరకాండ పారాయణ కాని చెయ్యడం మంచిది.

  ధనుస్సు రాశి

  ఈ రాశి వారు కొద్దిగా ఆందోళనగా ఉంటారు అన్నీ బాగున్నా ఏదో తెలియని ఆందోళన వస్తూఉంటుంది,ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది వస్తుంది ఎక్కువగా అంటువ్యాదులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి,,సంపాదాన నెమ్మదిగా పెరుగుతుంది అవసరానికి తగ్గ ధనం మాత్రమే ఉంటుంది అవసరానికి మించి అప్పు చేసి ఖర్చు చేద్దాము అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది,దాచిన డబ్బు అంతా వస్తువుల మీదకు మార్చాల్సి వస్తుంది దీనివల్ల కొద్దిగా ఇబ్బంది పడాల్సివస్తుంది,మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారపంగాను చాలా బాగుంటుంది, ఉద్యోగం ఉన్నవారికి మార్పు ఉంటుంది,విద్యార్దులు కుటుంబానికి దూరంగా ఉండటంవల్ల బాగా చదవగలుగుతారు అన్నిరంగాలవారికి కొద్దిగా కష్టంగా ఉంటుందిగాని కష్టానికితగ్గా ఫలితం పొందగలుగుతారు,ధైర్యంగా ముందుకు సాగండి విజయం మిమ్మల్ని వరిస్తుంది,

  మీరు సుందరకాండ పారాయణ చెయ్యడం ద్వారా ధనాన్నిబాగా సంపాదించగలుగుతారు.



  మకర రాశి

  వీరికి ఈ సంవత్సరం అనుకున్న అంత ఇదిగా ఉండదు ఈసంవత్సరం నుండి ఏలినాటి శని మొదలుఅవుతుంది కనుక, ఏలినాటి శని ప్రభావం వీరికి మరీ అంత ఇబ్బందిగా ఉండదు కాని రాశ్యాధిపతి వ్యయ స్తితి ఎక్కువ ప్రభావం చూబిస్తుంది దీనివల్ల కొద్దిగా డబ్బుపరమయిన ఇబ్బందులు ఎదురు అవుతాయి ఎక్కువగా వస్తువు లేదా స్థలం మీద పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటారు అవసరానికి డబ్బుఅందని పరిస్తితి ఎదురు అవుతుంది,విదేశిప్రయాణాలకు చాలా మంచి సమయము,పెద్దవారు కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి,విద్యార్దులు కష్ట పడి చదువుకుంటారు,ఉద్యోగం వ్యాపారాలు నెమ్మదిగా ఉంటాయి కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అంత మంచిసమయము కాదు,మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది, కొత్తగా ఏవిషయాలు ప్రయత్నించకండి అంత మంచి సమయం కాదు,

  మీరు మన్యుపాశుపత రుద్రాభిషేకం నల్ల ద్రాక్ష రసంతో చేయించుకోవడం చాలా మంచిది



  కుంభ రాశి

  మీకు మంచి సమయము స్టలాలు లేదా ఇల్లు తీసుకోవడానికి చాలా అవకాశాలున్నాయి కనుక ప్రయత్నించేవారు ప్రయత్నిచండి, వ్యాపారములో డబ్బు బాగా వస్తుంది కాని శతభిషం నక్షత్రం వారు వ్యాపారములో డబ్బు పెట్టకండి వ్యాపార సహచారులద్వారా కొద్దిగా ఇబ్బంది వస్తుంది,విద్యార్దులకు మంచి సమయము స్కాలర్షిప్ప్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి,ఆరోగ్యపరముగా గొంతు లేదా కళ్ళకు సంబందించిన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి,భార్యాభర్తలు మనస్పర్దలకు పోకుండా జాగ్రత్తగా ఉండండి,స్త్రీలకు వివాహ సమయము,ఎవరినీ నమ్మి దబ్బుఇవ్వకండి ముక్ష్యంగా దగ్గరవారికి,నెమ్మదిగా వ్యవహరించండి ఏదయినా ఒకపని చేసేటపుడు ఆలోచింది చెయ్యండి అన్నివిధాలా మీకు ఉపయోగపడుతుంది,

  మీరు దత్త కవచం చదువుకోవడం మంచిది.



  మీన రాశి

  మీకు ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది కరంగా ఉంటుంది నలుగురిలో పేరుకోసం చూడకండి దానికి వ్యతిరేకంగా జరుగుతుంది,ఏదయినా ఒక పని చేసేటప్పుడు ముందునుంచీ అనుకోకండి అది సంపూర్ణం అవ్వదు,వృత్తిలో సహచరులు లేదా వ్యాపారంలో సహచరులతో గొడవలు రావచ్చు జాగ్రత్త అవసరము,విద్యార్దులకు చదువు బాగా సాగుతుంది కాని ప్రేమవ్యవహారాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు,ఈ రాశివారికి సంపాదన బాగుంటుంది అనుకోకుండా డబ్బుఖర్చు అయిపొతూ ఉంటుంది దూర ప్రయాణాలు చెయ్యడం వల్ల మానసికంగా చాలా ప్రశాంతత పొందగలుగుతారు,వ్యాపారనిమిత్తమై డబ్బు అప్పులేదాలోన్ తీసుకోదలచినవారు ప్రయత్నించండి డబ్బు సమకూరుతుంది,ఆరోగ్యపరంగా ఆయాసం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి,ఎప్పుడూ అవతలవారిని నమ్మకండి మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి,

  మీరు దత్తపాశుపత హవనం లేదా హోమం చేయించుకోండి మనస్సు స్తిమ్మితంగా ఉంటుంది.

  2017-05-08 16:15:48