Whatsapp : 9963164002

Articles Back Articles

  • ఏలినాటి శని

    అందరికి ఏలినాటిశని అనగానే అనిపించేది బాబోయ్ అన్నమాటే ముందుగా అసలు ఏమిటి ఇది ఎలావస్తుంది అన్నది తెలుసుకుందాము

    ఏలినాటిశని మానవజీవితం మూడు సార్లు వస్తుంది మనజన్మరాశికి శని 12-1-2 రాశులలో అనగా మన జన్మరాశికి వెనుక ఉన్నరాశి మనజన్మరాశి తరువాతిరాశులలో సంచరిచడానిని ఏలినాటి శని అంటారు దీనికి ఏడున్నర సంవత్సరాలు పడుతుంది ఒకసారి వచ్చి వెళ్ళిన తరువాత తిరిగిరావటానికి ఇరవైరెండున్నర సంవత్సరాలు పడుతుంది మొదటిసారి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి 30సంవత్సరాలు అన్నమాట,

    ఒకవేళ మీకు 5 సంవత్సరాలు వున్నప్పుడు వచ్చింది అనుకోండి 35కి రెండో సారి 65కి మూడోసారి వస్తుంది అదే మీకు 20 సంవత్సరాల వయసులో వస్తే రెండో సారిరావటానికి 50సంవత్సరాలు పడుతుంది ఇక మూడోసారి రావటానికి 80సంవత్సరాలు పడుతుంది ఇంతకాలం చాలామంది జీవించి ఉండరుకాబట్టి మూడోవసారి వచ్చేసరికి వీరు ఉండరు.

    ఇక చాలా మందికి ఎన్నో అపోహలు అనుమానాలు వున్నాయి అవి అన్నీ తీర్చడానికే ఇది.

    ఏలినాటి శని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది అనిలేదు ఒకే రాశి రెండున్నర రోజుల పాటు ఉంటుంది ఈరెండు రోజులలో పుట్టిన వారందరూ ఇబ్బంది పడుతున్నారా లేదుకదా చాలా మంది మంచిమంచి ఫలితాలను ఏలినాటిసమయములోనే పొందుతున్నారు కాబట్టి ముందుగా ఈ అనుమానాన్ని పోగొట్టుకోండి

    ఇక అసలువిషయానికి వెళ్దాము

    ఏలినాటి శని మూడు సార్లు వస్తుంది ప్రతీసారి మూడు విధాలుగా వస్తుంది మన రాశికి వేనుకరాశిలో ఉన్నప్పుడు ఒకలా మన జన్మరాశిలో ఒకలా మన తరువాతిరాశిలో ఒకలా ఫలితాలను ఇస్తుంది

    మన వేనుకరాశిలో ఉన్నపుడు ఇది ప్రారంభము మనవేనుకరాశిలోకి ఎప్పుడు ఈయన ప్రవేసిస్తారో అప్పుడు ఏలినాటి శని మొదలవుతుంది ఇది ప్రారంభ భాగం ఈ రెండున్నర సంవత్సరములు అన్ని రాశులవారికీ ఒకే విధంగా ఫలితాలు ఇవ్వాలి అనిలేదు కాని కొన్నిమాత్రం ఒకే విధంగా ఉంటాయి ఈయన పని ఏమిటీ అంటే అందరి నిజస్వరూపాలు మనకి తెలియజేయ్యడమే అంతవరకూ బానే ఉన్నవారందరూ అవసరాల కోసం మనదగ్గర డబ్బు తెసుకోవడం లేదా హామీలు పెట్టమనడం జరుగుతాయి అది మనంచేసే మొదటితప్పు ఎప్పుడు అయితే ఇలా చేస్తామో అప్పటినుండి అసలు పనిమొదలవుతుంది కాని ఏమవుతుంది అన్నది మనకే తెలియదు సంపాదన వస్తుంది దానికి తగ్గ ఖర్చులూ కనిపిస్తాయి ఇందులో ఒక మంచి విషయం ఏమిటీ అంటే ఏలినాటి శని మొదలవటానికి 1-2 సంవత్సరాల ముందునుండి స్తలాలు లేదా ఇల్లు తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఎక్కువగా ఖర్చుపెట్టారో ఆప్రభావం అంతా ఇప్పుడు చుబిస్తుంది అన్నమాట సంపాదన వస్తుంది కాని దాచడానికిఅవ్వదు ఇది మొదటి భాగం

    మన జన్మరాశికి వచ్చినప్పుడు రెండవ భాగం

    ఇప్పుడు మనం దాచిన ధనం అంతా నెమ్మదిగా బయటకు తియ్యవలసి వస్తుంది ఈయన ధర్మానికి బాగా ప్రాధాన్యత ఇస్తారు మనం అధర్మంగా లేదా అడ్డదారిలో సంపాదించిన ధనం మొత్తం నెమ్మదిగా ఖర్చయిపోతుంది మనదగ్గర తీసుకున్న వారిని అడిగితె ఇదిగో అదిగో అంటూ జరిపెస్తారు మనం గట్టిగా అడగటానికి హామీలు ఉండవు కనుక ఏమిచేయ్యలేము, కొంతమందికి సంపాదన ధనం ఉంటుంది కాని ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది అవ్వడం జరుగుతుంది

    ఇక మూడవ భాగం లోకివస్తే

    మనజన్మరాశి తరువాత రాశిలోకి ప్రవేశం జరిగినప్పుడు నెమ్మదిగా సంపాదన మీద దృష్టి పెడతాము బాగా కష్టపడి సంపాదన మొదలు పెడతారు నెమ్మదిగా కోల్పోయిన దానిని సంపాదించగలుగుతారు కాని ఎవరికీ చెప్పుకునే ఉద్దేశం ఉండదు ఇది పెద్దవయసు వారికీ లేదా మూడోసారి ఏలినాటి శని వచ్చినవారికి అంత మంచిసమయం కాదు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఏడున్నర సంవత్సరాలు గడుస్తాయి చాలా నెమ్మదిగా

    ఇక అందరికీ ఉండే ప్రశ్నలు



    1 ఈ సమయములో మన ప్రాణానికి ఇబ్బంది అవుతుందా ?

    A: అలా అనుకోడానికి ఉండదు ఇది చాలా తప్పుడు ప్రచారం మూడోసారి వచ్చినప్పుడు మన ప్రాణానికి ఇబ్బంది అవుతుంది అనుకోవడం అంత మంచి ఆలోచనకాదు అది నిజంకూడా కాదు దీనికి ముక్ష్యంగా మన జాతకములో మారక దశవచ్చినప్పుడు ఏలినాటి శని కూడా వస్తే అప్పుడు మాత్రమె ఇబ్బంది తప్పించి వేరే విధంగా ఆలోచించకూడదు.

    2 ఈ సమయములో మనం ఇబ్బంది పదాల్సివస్తుండా ?

    A: ముందుగా చెప్పినట్టు అందరికీ ఇలా ఉండదు ఎవరికయితే ఏలినాటి శనితో పాటు శనిదశ లేదా అంతర్ దశ వస్తుందో వారికి మాత్రం పైన తెలిపిన విధాలుగా ఇబ్బంది పడాల్సిరావచ్చు.

    3 ఏమి చేసుకోవడం మంచిది ?

    A: అందరూ చేసే ఒక తప్పు ఏమిటీ అంటే వెంటనే శని జపం చేయించడం నీలం ధరించడం ఇది అసలు మంచి పనికాదు ఎప్పుడయినా మనకి ఇబ్బంది చేసేవారికి ఒక కర్ర ఇవ్వడం వల్ల మనకే ఇంకా ఇబ్బంది అవుతుంది ఇది ఎవరూ గమనించటం లేదు దీనివల్ల చేతితో కొట్టవలసిన వారు కర్రతో కొడుతున్నారు, ఎవరైనా మనకన్నా బలవంతులు మన మీదకు వస్తే ఓపిక ఉంటె ఎదురునిలబడాలి లేదా పోలీసుల సహాయం తీసుకోవాలి తప్ప చేతికందినవి అతనిమీదకు విసిరితే ఏమవుతుంది ఇంకా కోపంతో మనమీదకు వస్తాయి అవి తిరిగి.

    కనుక మొదలయిన మొదటి రెండు సంవత్సరాలు ఏమిచేయ్యకుండా వేచి ఉంది తరువాత ఆంజనేయస్వామి పూజలు చేసుకోవడం లేదా మన్యుపాశుపత రుద్రాభిషేకం చేయించుకోవడం ఇంకా ఓపిక ఉంటె సుందరకాండ పారాయణ లేదా మన్యుసూక్త పారాయణ చేసుకోవడం మంచిది మొదటే చేసుకోవడంవల్ల అవి అవసరమయిన సమయానికి పనికిరావు మనం తరచూ చేస్తాము అంటే పరవాలేదు కాని శనికి జపాలు చేయించేటపుడు దానితోపాటు మన్యుసూక్త పారాయణ కూడా చేయించడం మంచిది

    మీకు ఏమయినా అనుమానాలు ఉంటే నన్ను సంప్రదించండి

    శ్రీ శ్రీ విద్యా జ్యోతిష్యాలయం

    అనుదీప్ శర్మ

    whatsapp: 9963164002

    2017-05-08 16:16:45