Whatsapp : 9963164002

Articles Back Articles

  • నక్షత్రముల వారీగా పరిహార క్రియలు

    ఓం శ్రీ మాత్రే నమః

    ఓం శ్రీ గురుభ్యో నమః

    మనము పుట్టిన సమయానికి చంద్రుడు ఏనక్షత్రము నందు ఉన్నాడో అదే మన జన్మ నక్షత్రం అవుతుంది ఒకవేళ పుట్టిన సమయం తెలియనట్టయితే నామ నక్షత్రం చూసుకోవాలి .

    ప్రతీ నక్షత్రానికి ఒక అధిదేవత నక్షత్ర అధిపతి ఉంటారు ఆ అదిదేవతకు గాని నక్షత్ర అధిపతికి గాని తగిన విధంగా శాంతి చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతని పొందవచ్చు .

    ఇవి ఎప్పుడుచేసుకోవాలి అంటే మనకు ఎంత సంపాదన ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదో తెలియని ఆందోళన వస్తూ ఉంటుంది దీనికి కారణం చంద్రునికి పాప సంబంధం రావడం వల్ల అప్పుడు ఈ కిందచేప్పిన విధంగా చెయ్యడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది .

    ఇప్పుడు రెమిడీలు వరుసగా

    అశ్విని: దీనికి అధిపతి కేతువు అధిదేవత అశ్వినీ దేవతలు- అనారోగ్యంగా ఉన్నవారికి మందులు దానం చెయ్యడం వల్ల లేదా వారికి వైద్యం చేయిచడం మంచిది.
    భరణి:దీనికి అధిపతి శుక్రుడు అధిదేవత యమధర్మ రాజు –ఎప్పుడూ ధర్మం వైపు ఉండటానికి ప్రయత్నించండి తీపి పదార్దాలు దానం చెయ్యండి .
    కృత్తిక :అధిపతి రవి అధిదేవత అగ్ని – కోపం తగ్గించుకోవాలి రొజూ ఉదయం దేపం వెలిగించి నమస్కారం చెయ్యాలి .
    రోహిణి :అధిపతి చంద్రుడు అధిదేవత బ్రహ్మ- తల్లిని ప్రేమగా చూసుకోవాలి రొజూ ఉదయం బ్రహ్మ దేవుణ్ణి తలచుకుని నీరు అర్ఘ్యం ప్రసాదించాలి .
    మృఘశిర:అధిపతి కుజుడు అధిదేవత చంద్రుడు – ఆవుపాలు దానం చెయ్యండి ఎర్రని వస్తువులు దానం చెయ్యండి .
    ఆరుద్ర : అధిపతి రాహువు అధిదేవత ఈశ్వరుడు – మాస శివరాత్రులు రుద్రాభిషేకం చేయించుకోండి కుదిరితే రొజూ శివ పంచాక్షరి 108 సార్లు జపించండి .
    పునర్వసు:అధిపతి బృహస్పతి అధిదేవత అదితి –చిన్నపిల్లలకు చిరుతిళ్ళు కొనిపెట్టండి పిల్లలను ప్రేమగా చూసుకోండి .
    పుష్యమి:అధిపతి శని అధిదేవత బృహస్పతి –విద్యా దానం చెయ్యండి లేదా ఎవరికన్నా చాడువుకోరకు స్పాన్సర్ చెయ్యండి .
    ఆశ్లేష :అధిపతి బుధుడు అధిదేవత సర్పం –కంగారు తగ్గించుకోవాలి జంటసర్పాలకు అభిషేకం చేయిచుకోండి.
    మఖ:అధిపతి కేతువు అధిదేవత పితృదేవతలు – తల్లితండ్రులతో ప్రేమగా ఉండండి అనాదలకు అన్నదానం చెయ్యండి .
    పుబ్బ లేదా పూర్వ ఫల్గును :అధిపతి శుక్రుడు అధిదేవత కామ దేవత కొతమంది దృష్టిలో ఆర్యమావు(సూర్యని ఒక అంశ )-పేద పిల్లలకు సహాయం చెయ్యండి స్త్రీలను గౌరవించండి .
    ఉత్తర లేదా ఉత్తర ఫల్గుని :అధిపతి రవి అధిదేవత భగుడు : ఉదయం ఎర్రని అవుకు దానా పెట్టండి తండ్రికి సేవ చెయ్యండి .
    హస్త : అధిపతి చంద్రుడు అధిదేవత సూర్యనారాయణ మూర్తి –రొజూ ఉదయం సూర్యునికి నిరు అర్ఘ్యం ఇవ్వండి ఒక 10నిమషాలు ప్రాణాయామం చెయ్యండి .
    చిత్ర :అధిపతి కుజుడు అధిదేవత విశ్వకర్మ- సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం బ్రహ్మ చారులకి వస్త్ర దానం చెయ్యడం .
    స్వాతి: అధిపతి రాహువు అధిదేవత వాయుదేవత –తెలుపు నలుపు రంగుల వస్త్రం దానం చెయ్యండి దుర్గ దేవికి కుంకుమ పూజ చేయించుకోండి .
    విశాఖ :అధిపతి బృహస్పతి అధిదేవత ఇంద్రాగ్ని –వేడి నీరు దానం చెయ్యండి గురువారం నాడు పసుపురంగు వొత్తు తో దేపం వెలిగించండి .
    అనురాధ : అధిపతి శని అధిదేవత మిత్రన్ – మిత్రులకోసం కొద్దిగా డబ్బు ఖర్చు చెయ్యండి భార్యను ప్రేమగా చూసుకోండి
    జ్యేష్ట:అధిపతి బుధుడు అధిదేవత ఇంద్రుడు – మంగళ వారం జ్యేష్ట గాని ఆశ్లేషా నక్షత్రం గాని అయినపుడు 500 గ్రాముల పెసలు దానం చెయ్యండి .
    మూల :అధిపతి కేతువు అధిదేవత ఈశ్వరుని ప్రళయ రూపం : గురువారం దుర్ముహూర్తం లో దీపం వెలిగించి లమిత్యాది పంచ పూజ చెయ్యండి .
    పుర్వాషాడ:అధిపతి శుక్రుడు అధిదేవత జలం-శుక్రవారం నాడు మేకుదగ్గరలో ఉన్న నడివద్దకు వెల్లి జాలానికి పూజ చేసి నిరు శిరస్సున ధరిచండి .
    ఉత్తరాషాడ :అధిపతి రవి అధిదేవత విశ్వాదేవాతలు :శనివారం నాడు గురుహోరలో ౩౦౦ గ్రాముల శనగలు దానం చెయ్యండి మకర రాశివాళ్ళు శనివారం శనిహోరలో నల్ల ఇంకు బాటిల్ ను లేదా నల్ల ఇంక్ పెన్ ను దిష్టి తెయిన్చుకుని ఎవరికన్నా ఇచ్చేయండి.
    శ్రవణం: అధిపతి చంద్రుడు అధిదేవత విష్ణు మూర్తి –మీరు శనివారం నాడు గాని ఏకాదశి నాడు గాని వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన చేయించండి.
    ధనిష్ఠ:అధిపతి కుజుడు అధిదేవత వాసుకల్ –మంగళ వారం శనిహోరలో నువ్వుల నునితో దీపం పెట్టండి నువ్వులు దానం ఇవ్వండి.
    శతభిషం : అధిపతి రాహువు అధిదేవత వరుణుడు –శనివారం రాహుకాలం లొ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి .
    పూర్వాభాద్ర :అధిపతి బృహస్పతి అధిదేవత అజ ఏక పాదుడు- ఇనప వస్తువులు దానం చెయ్యండి పేదవాళ్ళకు అన్నదానం చెయ్యండి శనివారం నాడు .
    ఉత్తరాభాద్ర:అధిపతి శని అధిదేవత ఆహిర్భుద్ని-గురువారం నాడు శని హోరలో నువ్వులు బెల్లం కలిపి తెల్లై లేదా పసుపురంగు అవులకు పెట్టండి.
    రేవతి: అధిపతి బుధుడు అధిదేవత పుషావు –బుధవారం నాడు గురుహోరలో పెసలు దానంచేయ్యండి ఇద్దరు బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యండి ..


    ఇలా మన నక్షత్రానికి తగ్గ రెమిడీ ఆచరించడం ద్వారా మనకు మానసిక ప్రశాంతత వస్తుంది.



    మరిన్ని వివరాలకోసం లేదా జాతకపరమయిన సమాచారం కోసం

    సంప్రదించండి

    శ్రీ శ్రీ విద్యా జ్యోతిష్యాలయం

    అనుదీప్ శర్మ

    9963164002 whatsapp

    2017-05-08 17:38:29