Whatsapp : 9963164002

Articles Back Articles

  • మంత్రం అంటే ఏమిటి మంత్రసాధన అంటే ఏమిటి ? What are mantras and how mantras work in telugu

    మంత్ర శాస్త్రం : శ్లో|| మననాత్ త్రాయతే ఇతి మంత్రఃrnఏదయినా ఒక దేవతా నామాన్ని లేదా బీజాక్షరాని అదే విధంగా మనస్సులో మరలా మరలా స్మరించడాన్ని మంత్ర జపం అంటారుrnrnఇవి నిజంగా పనిచేస్తాయా అని అందరికీ అనుమానం వస్తుంది అలాంటివాల్లకు నాదగ్గర మంచి సమాధానం ఉందిrnrnమంత్రము అంటే కొన్నిఅక్షరాలను క్రమబద్ధం గా కలిపి వాడటమే ఇలా వాడటం వల్ల ఉత్పన్న మయిన వైబ్రేషన్ ను ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉత్పన్నమయిన శక్తి (వైభ్రేషన్) అవతలి శక్తి మిద పడి ఆ శక్తి ని మనకు అనుకూలం గా గాని వ్యతిరేకం గా గాని మార్చుతుంది అది మన సంకల్పం మీద ఆధారపడి ఉంటుందిrnrnఅలా ఏలా అవుతుంది అని మల్లి కొంత మందికి అనుమానం వస్తుందిrnrnమనం ఒక నలుగురిలో ఉన్నప్పుడు ఎదో విషయమై మాట్లడుకున్తున్నాము అనుకోండి అప్పుడు ఎవరో వచ్చి మనల్ని పిలిచినప్పుడు ఆ శబ్దం ద్వారా ఉత్పన్నమయిన వైబ్రేషన్ మన వైబ్రేషన్ ని డామినేట్ చెయ్యడం వల్ల ఆటోమేటిక్ గా మన ఏకాగ్రత చెడిపోయి ఆ శభ్దం చేసిన వ్యక్తిమిదకు దృష్టి మారుతుంది కొంతమందికి అయతే బాగా డామినేట్ చేసి నెగిటివ్ గా పనిచేసి కోపం కూడా వచ్చేస్తుంది అలాగే మనం మంత్రం జపం చెయ్యడం వల్ల వచ్చిన శక్తి మన కోరిక ప్రకారం మనకు కావలసిన లక్ష్యం మీద లేదా దేవత మీద పడి దానిని మనకు గాని మనం అనుకున్న వ్యక్తులకు గాని ప్రతికూలంగా గాని వ్యతిరేకంగా గాని మార్చగలుగుతుంది మంత్ర శాస్త్రంలో ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి మన అవసరానికి తగ్గట్టు వాడుకోవాలి తప్ప అవతలవాళ్ళ నాశనానికి వాడకూడదు అలా చెయ్యడం వల్ల ఒక్కోసారి మనకే వ్యతిరేకం గా పనిచేస్తాయిrnrnఒక మంత్రము అనేది గురువుగారి ద్వారా మాత్రమె వచ్చినపుడు అది సిద్ధిపొందుతుంది అంటారు దనివెనుక ఉన్న అంతరార్ధము ఏమిటీ అంటే పూర్వము ఇప్పటిలా ఇన్ని పుస్తకాలు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండేవి కాదు కాబట్టి ఒక గురువు గారి దగ్గరకు వెళ్లి నాకు ఈ అవసరానికి తగ్గ మంత్రం ఉపదేశం ఇవ్వండి అనగానే గురువు గారు వీడు మంచివాడా కాదా దీనీని మంచికి ఉపయోగిస్తాడా స్వార్ధానికి ఉపయోగిస్తాడా అని పరిక్షపెట్టి మంత్రాన్ని అక్షర దోషాలు లేకుండా ఎలా ఉచ్చరించ్చాలో చెప్పి ఇచ్చేవారు మనం పుస్తకం లో చూసుకుని చదువుకోవడం వల్ల ఉచ్చారణా దోషాలు రావటం వల్ల ఆ మాత్రం సరిగ్గా పనిచెయ్యదు అది అలా ఉంచితే మన మీదకే వ్యతిరేకం గ పనిచేస్తాయి అందుకే ఈ విధానాన్ని ఏర్పరిచినారు,rnrnమంత్ర శాస్త్రం గురించి అందరికీ తెలిసింది ఒకటి తెలియాల్సింది ఒకటి ఈకాలం లో అందరూ మంత్రశాస్త్రం గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు అది వాడాల్సిన విధంగా వాడటం లేదు ఎక్కువగా జాతకభాగంలో మంత్ర శాస్త్రాన్ని వాడి రేమిడీలు ఆచరించేసమయములో చాలా అశ్రద్ధ వహిస్తున్నారు ఒక మంత్రము అనేది తెలిసినవారిచేత లేదా ఆమంత్రాన్ని అనుష్టానం చేసేవారి ద్వారా తీసుకోవడం వల్ల దాని పూర్తీ ప్రభావంకనిపిస్తుంది,దానిని వాడాల్సిన దానికి మాత్రమే వాడాలి చిన్న చిన్న విషయాలకి వాడటం అనేది వృదాచేసుకోవడమే ఇది కేవలం మంత్ర సాధకులకు మాత్రమే అర్ధమవుతుంది, కిందన పడి ఉన్న పుల్లను తియ్యడానికి వందో రెండువందలో ఖర్చు పెట్టి కూలీని పెట్టుకుంటారా లేదు కదా దానికి తగ్గ పని ఉండాలిrnrnఅలాగే ఒక మంత్రం సాధన చేసే సమయములో దానికితగ్గ జాగ్రత్త తీసుకోవాలిrnrnఅందరికీ అర్ధమయ్యే విధానంగా :మంత్రం అనేది ఒక పెంపుడు జంతువు లాంటిది దానిని తీసుకున్నప్పటి నుండి లేదా ఇంటికి తెచ్చుకున్నప్పటి నుండి దానికితగ్గ ఆహారం దానికి పెట్టాలి లేదా అది మనకు పనికిరాదు అది ఏచిన్నదో అనుకోండి అదే మరణిస్తుంది లేదూ ఏక్రూర మృగమో అయితే మాలనే పీక్కు తింట్టుంది ఇది మీకు అర్ధమయే ఉంటుంది ఇక్కడ చిన్నది అంటే సాత్వికమయిన మంత్రం క్రూర మృగం అంటే తామసలేదారాజస మంత్రం అనిఅర్ధం లేదా మనం దానికి తగ్గ ఆహారం అదే సంపాదించుకునే విధానం ఏర్పాటు చెయ్యగలగాలి ఇది చాలా కష్ట మయిన విధానం అది ఎలా అంటేrnrnఇప్పుడు సాత్విక మంత్ర సాధన అనుకోండి ముందుగా గణపతి అనుష్టానం పుచ్చుకోవాలి ఇది కనీసం ఒక లక్షసార్లు అన్నా జపం చెయ్యగలిగితే కొద్దిగా ఆ మంత్రం మీద పట్టు కుదురుతుంది దీనివల్ల ఈయన మనకి సేక్యురిటీగా ఉంటారు తరువాత వేరే మంత్రం తీసుకున్నపుడు ఒక్కోసారి అదిచేయ్యలేకపోయినా ఈయన దాని ఆలనా పాలనా చూసుకుంటారు,గాయత్రీ మంత్రం కుడా ఇలానే పనిచేస్తుంది వీటివల్ల అనుష్టానంలో జరిగే లోపాలు కొద్దిగా సర్డుపరుచుకోగలము అలాగని ఇవిచేయ్యకుండా కేవలం మిగతావి చెయ్యడం వల్ల వాటికి శక్తి సమకూరదు పాసిటివ్ నెగిటివ్ కలిస్తేనే కదా పవర్ వచ్చేది ఎదో ఒకటే ఉంటే దానివల్ల మనకి ఉపయోగం ఉంటుందా లేదుకదా,rnrnకాబట్టి ముందుగా గణపతి ఉపాసన ఉండాలి ఈకాలంలో అందరూ మంత్ర సాధన చేస్తున్నారు అందులో నెనుఎమీ తప్పు పట్టినట్టుకాదు బ్రాహ్మనులకయితే దోష నివారణకు గాయత్రీ మంత్రం చాలా మంచిది ఇతరులకు గణపతి ఇదే విధంగా పనిచేస్తుంది,rnrnదోషం ఏమిటీ అంటే నీకొరకు నువ్వు జపం చేసుకోవడం వల్ల ఎటువంటి దోషము ఉండదు కాని అవతలవారికోసం నువ్వు చెయ్యడం వల్ల దోషంవస్తుంది నువ్వు మంచికే చేసినా చెడ్డగా చేసినా సరే కొద్దిగా నీకు వారి దోషం వస్తుంది అదీ నువ్వు ముందుగా జాగ్రత్త తీసుకోనట్టయితే మాత్రమే ఇది ఎలా అంటే డాక్టర్లు మనకి వైద్యం చేసే సమయములో చేతులకు గ్లవ్స్ లు మాస్కులు తోడుగుకుంటారు లేదా మనకి ఉన్న వ్యాది వారికీ వచ్చే అవకాశాలుఉంటాయి అలాగే మనము సరైన జాగ్రత్త తీసుకోకుండా అవతలవారికోసం మంత్రాన్ని వాడుతున్నపుడు లేదా వారికోసం జపం చేస్తున్నపుడు మనకి కొంత దోషం వస్తుంది దానికే గాయత్రీ లేదా గణపతి సాధన ఉండాలి సాత్విక మార్గంలో మాత్రమే ఈ విధానం పనిచేస్తుంది తామస రాజస మార్గాలలో గణపతి స్థానంలో వేరే దేవత వస్తుంది ఇది ఆవిషయం గురించి చెప్పే సమయంలో వివరిస్తాను కాబట్టి ముందుగా జాగ్రత్త తీసుకుని ఏపని అయినా చెయ్యండి లేనిచో మీకే ఇబ్బంది అవుతుంది.rnrn

    2017-05-08 17:52:00