Whatsapp : 9963164002

Articles Back Articles

 • DEVI NAVARATRULA PUJA VIDHANAM IN TELUGU

  ఓం శ్రీ గురుబ్యో నమః
  ఓం శ్రీ మాత్రే నమః
  ముందుగా నేను చెప్పిన విధంగా ఈ సంవత్సరంలో దేవి నవరాత్రులు 21 వ తారీకు నుండి ప్రారంభం అవుతున్నాయి విజయదసమి 30 ఈ దేవి నవరాత్రులలో ఏమిచేయ్యడంవల్ల మీ మీ కోరికలు నేరవేరతాయో చెబుతాను
  1. మొదటిగా లక్ష్మి అనుగ్రహం పొందటానికి అంటే ధనాకర్షణ పెరగటానికి ఇంట్లో కుర్చుని నాకు డబ్బులు వచ్చెయ్యాలి అని పూజలు చేస్తే డబ్బులురావు బద్దకస్తులు లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు మనకంటూ ఒక ఆదాయం వచ్చే ఉద్యోగం కాని వ్యాపారం కాని ఉంటే దానిద్వారా ఇంకా ధనం రావడం పెరుగుతుంది లేదా ఉన్న ధనం కొద్దికొద్దిగా అభివృద్ధి చెందుతుంది
  2. మహాకాళి అనుగ్రహం మనం పొందగలిగితే మనచుట్టూ ఉన్న అందరిమీద మనకు ఆధిపత్య శక్తి ఎక్కువ అవుతుంది అందరూ మనమీద దృష్టి పెట్టేలా చేస్తుంది మనకి ఉన్న నరఘోష నివారణ జరుగుతుంది
  3.విద్యా ప్రాప్తికి పిల్లలకు విద్యార్దులకు మంచి విషయాలు తెలియటానికి మరియు వారికి తెలివితేటలూ వాక్ సిద్ధి పెరగటానికి మహా సరస్వతీ అనుగ్రహం పొందాలి
  ఇప్పుడు అసలు విషయానికి వస్తే ధనాకర్షనకి లక్ష్మీదేవి పూజ జనాకర్షణకు మహా కాళి పూజ విద్యా ప్రాప్తికి సరస్వతీ పూజ ఎలా చెయ్యాలో ఇక్కడ ఒక సులభమయిన విధానాన్ని తెలియచేస్తున్నాను


  కావలసిన సామగ్రీ
  పసుపు కుంకుమ తొమ్మిది రోజులకు కుంకుమ పూజకు సరపడేలా
  అమ్మవారి ప్రతిమ లేదా చిన్న విగ్రహం
  పుష్పాలు
  నివేదనకు ధనాకర్షణ కొరకు ప్రతీరోజు పరమాన్నం చెయ్యాలి లక్ష్మీ దేవికి
  జనాకర్షణకు మహాకాళి దేవికి పులగం
  విద్యాప్రాప్తికి సరస్వతీ దేవికి అయితే పెరుగన్నం
  దీపారాధన
  అగరవత్తులు
  హారతి కర్పూరం


  ధనాకర్షణకు ఈ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు మనం లక్ష్మీ దేవి స్వరూపాన్ని ఆరాధించాలి దానికి గాను మీరు చాలా నిష్టగా ఉండాలి
  జనాకర్షణ కొరకు మహాకాళి స్వరూపానికి పూజ చెయ్యాలి
  విద్యాప్రాప్తికి సరస్వతీ దేవికి మాత్రమె పూజ చేసుకోవాలి (ఇది పిల్లల చేత చేయిస్తే చాలా మంచిది మీరు చెయ్యడంకన్నా వారుచేయ్యడం మంచిది )
  ఎవరయినా ఈ విధానంగా పూజను చేసుకొనవచ్చు నేను చెప్పే విధానాలను జాగ్రత్తగా గమనించండి కేవలం బ్రాహ్మణులే చెయ్యాలి అని లేదు భక్తీ శ్రద్ధతో ఎవరన్న చెయ్యవచ్చు ఈ తొమ్మిది రోజులు పూజ చేసే టప్పుడు రొజూ ఉదయం స్నానం చేసి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ధనం కోసం లక్ష్మీ దేవికి ఆకర్షనకోరకు నరఘోష నివారణకు మహా కాళికి విద్యా ప్రాప్తికి సరస్వతీ దేవికి పూజలను చెయ్యాలి పూజా విధానం అన్ని దేవతలకు ఒకలాగే ఉంటుంది చివరలో పేరు మార్చాలి అంతే

  1.పూజా విధానం

  పూజా ఆరంభం ఇది సులభతరమయినది కేవలం శ్లోకాలతో మాత్రమె ఉంటుంది ఎవరన్నా ఆచరించవచ్చు
  ముందుగా మీరు ఆచమనం చేసుకుని మీగోత్రం పేరు చెప్పుకుని మీ ఆడవారి పేరుచెప్పుకుని పిల్లల పేర్లు చెప్పుకోండి
  ధనాకర్షణ కొరకు అయితే మహాలక్ష్మీ అనుగ్రహ సిధ్యర్ధం అని
  జనకర్షణకు అయితే మహాకాళి అనుగ్రహ సిధ్యర్ధం అని
  విద్యా ప్రాప్తికి అయితే మహాసరస్వతీ అనుగ్రహ సిధ్యర్ధం అని చెప్పుకోవాలి ఇంతకు మించి ఏమిచేప్పకండి కేవలం ఈ చిన్న సంకల్పం మాత్రమె చేసుకోండి
  అమ్మవారి ప్రతిమని లేదా విగ్రహానికి ఒక పళ్ళెంలో పెట్టి అవుపాలతో అభిషేకం చెయ్యండి లేదా తేనేతో చెయ్యండి
  తరువాత శుభ్రంచేసి కుంకుమ బొట్టుపెట్టండి
  1.రెండు పువ్వులు చేతితో పట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని
  శ్లోకం చెప్పండి
  యావిద్యా శివ కేశవాది జనని యావై జగన్మోహిని
  యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయినీ
  యా పంచ ప్రనవద్విరేఫనళినీ యా చిత్కలా మాలిని
  సా పాయా త్పరదేవతా భగవతీ శ్రీ రాజ రాజేశ్వరీ
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః ధ్యాయామి అని పుష్పాలు పెట్టండి
  ఏ దేవతకు చేస్తే ఆ పేరే చెప్పాలి

  2. శ్లో :కరుణారస సంపూర్ణ మరునాయత లోచనాం
  చరనాబ్జాశ్రయేద్భాక్త్యా దేవీమావాహయామి
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః ఆవాహయామి
  రెండు పుష్పాలు అమ్మవారికి సమర్పించండి

  3.ఏహి దేవి గృహణేశి రత్న సింహాసనం శుభం
  చంద్రకాంత మణిస్తంభం సౌవర్ణం సర్వసుందరం
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
  రెండు పుష్పాలు అమ్మవారికి సమర్పించండి

  4. ఈశాదిదేవ సంసేవ్యే భావే పాద్యం శుభప్రదే
  గంగాది సరితానీతం సంగృహాణ సురేశ్వరీ
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః పాదయో పద్యం సమర్పయామి
  నిరు అమ్మవారికి సమర్పించండి

  5. లక్ష్మీ వాణి ముఖా సేవ్యే దేవదేవేశ వందితే
  గృహాణార్ఘ్యం మయాదత్తం లలితే లలితాంబికే
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
  నిరు అమ్మవారికి సమర్పించండి

  6.హ్రీంకార మూర్తే లలితే సర్వభాక్తాభి వందితే
  గ్రుహానాచమనం దేవి మయాదత్తం మహేశ్వరి
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః ముఖే ఆచమనం సమర్పయామి
  నిరు అమ్మవారికి సమర్పించండి

  7. హత్యాదిపాపశమనే హరిదాశ్వాది వందితే
  సువర్ణ కలశానేతై: శేతైహ్ స్నాహి శుభైహ్ జలైహ్
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః పాదయో స్నపయామి
  నిరు అమ్మవారికి సమర్పించండి

  8.సకార రూపే సర్వేశీ సర్వహన్త్రీ సనాతనీ
  సౌవర్నాం చల సంయుక్తం వస్త్రయుగ్మంచ ధారయ
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః వస్త్రం సమర్పయామి
  పుష్పాలు సమర్పించండి

  9.కకారఖ్యే కామరూపి కామితార్ధ ప్రదాయిని
  యజ్ఞ్యోపవీతం దేవేశి స్వీకరుష్వమయార్పితం
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః యజ్ఞ్యోపవీతం సమర్పయామి
  పుష్పాలు సమర్పించండి

  10.హకారఖ్యే హసంగతే హాటకాభరణో జ్వలె
  చందనం ధారయె శ్రీమత్సుగంధం దివ్యమిశ్రితం
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః చందనం సమర్పయామి
  చందనం సమర్పించండి

  11. లకారఖ్యే లతాపూజ్యే లయ స్తిత్యుద్భవేశ్వరీ
  వలక్షా నక్షతాం దేవి గృహాణ కరునాకరి
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః ఆభరణం సమర్పయామి
  రెండుపుష్పాలు సమర్పించండి

  12.హ్రీంకార కుండాగ్ని శిఖే హ్రీంకార శశి చంద్రికే
  కుందమందార పుష్పాషు గ్రుహానేశ్వరి భాస్వరీ
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః కుంకుమ మిశ్రిత హరిద్రం పూజయామి
  ఇక్కడ మీరు అమ్మవారికి అస్తోత్రంకాని సహస్ర నామములతోగాని పూజ చెయ్యవచ్చు
  ధనాకర్షనకి కుంకుమతోను
  జనాకర్షణకు కుంకుమ మరియు పసుపు కలిపి
  విద్యాభివృద్ధికి పసుపుతోను అమ్మవారికి పుజచేయ్యండి

  13.సకారఖ్యే సమరసే సకలాగమ సంస్థితే
  ధూపం గృహాణ లలితే పాపం నాశయ పాహిమాం
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః ధూపమాఘ్రాపయామి
  ధూపం వెయ్యండి లేదా అగరవత్తులు వెలిగించి ధూపం చూబించండి

  14.కకారిణీ మహాదేవి కామేశ్వర సుఖప్రదే
  దీపం గృహాణ దేవేశి మయాదత్తం మహేశ్వరీ
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః దీపం సమర్పయామి

  15.లాబ్దాతిశయ సర్వాంగం సౌందర్యా లబ్ధవిభ్రమే
  నైవేద్యం షడ్రసోపేతం త్వం గృహాణ మయార్పితం
  అమ్మవారికి చేసినటువంటి నివేదన సమర్పించండి

  16. హ్రీం కార మూర్తే హ్రీంకార సౌధ కపోతకే
  తాంబూలం దేవి లలితే త్వం గృహాణ మయార్పితం
  మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః తాంబూలాది సర్వోపచారాం సమర్పయామి అని రెండుపుష్పాలు సమర్పించి
  హారతి ఇవ్వండి
  దీనిని షోడశ ఉపచార పూజ అంటారు
  ఇలా 9 రాజులు చెయ్యండి మద్యలో ఆపకుండా చెయ్యడం చాలామంచిది తరువాత విగ్రహంలేదాప్రతిమని మీ దేవునిమందిరంలో ఉంచుకోవండి
  వీటిద్వారా మీరు కోరుకున్న కోరికలన్నీ అవి ధర్మ బద్ధంగా ఉంటే తప్పకుండా నెరవేరతాయి
  హరిః ఓం తత్సత్
  మీకు ఎమన్నా అనుమానాలు ఉంటే సంప్రదించండి
  శ్రీ శ్రీ విద్యా జ్యోతిష్యాలయం
  అనుదీప్ శర్మ
  Deepu.dwivedula@gmail.com

  2017-09-17 05:02:12