Whatsapp : 9963164002
నాకు ఈ జ్యోతిష్యవిద్యను నేర్పిన గురువుగారికి నా ఈ జీవితం అంకితం
గురువుగారు తూర్పుగోదావరికి చెందిన మండపేట వాస్తవ్యులు చిన్న వయసునుండి జ్యోతిష్యవిద్యను నేర్చుకుని చాలా కష్టపడి మంచి స్థానానికి వచ్చారు సుబ్రహ్మన్యోపాసకులు గురువుగారు ఎప్పుడూ మనం అనుకున్న స్థానానికి చేరేవరకు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేవారు నాకు జ్యోతిష్యవిద్యను నేర్పి మంత్ర తంత్ర శాస్త్రాల గురించి విపులీకరించి శ్రీవిద్యోపాసన ఇచ్చి నాజీవితానికి ఒక మార్గాన్ని ప్రసాదించారు.
జన్మ స్థలం తూర్పుగోదావరి లోని అన్నవారం నాకు పదిహేనుసంవత్సరముల వయసు నుండి ఈ జ్యోతిష్యవిద్యను గురువుగారి అనుగ్రహంతో నేర్చుకున్నాను అదే సమయములో మంత్ర శాస్త్రంలో అనుభవం సంపాదించగలిగాను ప్రస్తుతం అన్నవరం దేవస్తానంలో ఉద్యోగరీత్యా వ్రతపురోహితునిగా పనిచేస్తున్నాను.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనముపూర్వ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలకు ఈ జన్మలో ఫలితాలు అనుభవిస్తాము అది మంచా లేదా చెడా ఎప్పుడు అనుభవించాల్సివస్తుంది అన్నది మన జాతకచక్రం ప్రకారం మనము తెలుసుకోనగలుగుతాము అసలు విషయానికి వస్తే మన భవిష్యత్తు మనకి తెలిసినతరువాత అది మారదా అని మీరు అడగవచ్చు జరిగేదిజరగక మారదు అన్నప్పుడు జాతకము చెప్పించుకోవడం అవసరమా అనికూడా అడగవచ్చు వారికి నా సమాధానం దీనిని వైద్య పరిభాషలో మొదట చెబుతాను మనకు అనారోగ్యంగా ఉంది లేదా అలసటగా ఉంది అని ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళాము ఆయన పరీక్షచేసి రోగనిర్ధారణ చేసారు లేదా నీకు ఈ వ్యాది వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నిర్ధారించారు చిన్న వ్యాది అయితే మందులు వాడటం లేదా ఏమయినా చేయించుకోవడం ద్వారా ఆవ్యాది రాకుండా ఉంటుంది కాని పెద్దది అయితే రాకుండా ఆపలేము కాని కొంతకాలం పోడిగించగలము అలాగే జ్యోతిష్యములో కూడా కొన్ని కొన్ని విషయాలు మనము మార్చగలము కొన్ని కేవలం కొంతకాలానికి పొడిగించగలము అంతే. ఇక్కడ ఫలితాలను మూడు రకాలుగా విభజించారు అవి దృఢయోగం అదృఢయోగం దృడాదృఢయోగం దృఢయోగం :మరణము దీని నుండి మనల్ని ఎవరూ కాపాడలేరు . అదృఢయోగం :ఉద్యోగం,వ్యాపారం,ధనం,లాంటివి కొన్ని పరిహారక్రియలు చెయ్యడం వల్ల కొద్దిగా అదుపు చెయ్యగలుగుతాము . దృడాదృఢయోగం: సంతానం,ప్రమాదాలు,ఆరోగ్యం,వైవాహిక జీవితం,లాంటివి మనము పరిహారక్రియలు చెయ్యడం ద్వారా ఆపగలము ఒక్కోసారి మార్చలేము